హైదరాబాద్: 28°C
వార్తలు

పోలీస్ డాగ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

WNP: జిల్లా పోలీసు శాఖలోని పోలీస్ డాగ్‌ను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పరిశీలించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయమును పరిశీలించారు. పోలీస్ శునకం పనితీరు, శిక్షణ విధానంపై అధికారులను అడిగి తెలుసుకుని, పోలీసు శాఖ ఆధునిక సౌకర్యాలతో మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు. శిక్షణ, నేరాల ఛేదనలో శునకం పాత్రపై అధికారులతో మాట్లాడి వారి సేవలను అభినందించారు.