హైదరాబాద్: 28°C
వార్తలు

మూలమలుపుల రోడ్డుపై హెచ్చరిక బోర్డులు కరువు

WNP: వీపనగండ్ల మండలం పుల్గర్‌చర్ల–కల్వరాల రహదారిపై ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వంపులు ఉన్న ప్రాంతాల్లో బోర్డులు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా సంబంధిత అధికారులు వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.