హైదరాబాద్: 28°C
వార్తలు

జీవో 396 రద్దు చేయాలంటూ పెన్‌డౌన్

KRNL: ఆదోని సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు సోమవారం మొదటి రోజు పెన్‌డౌన్ కార్యక్రమం చేపట్టారు. జీవో నెం. 396ను వెంటనే రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని సంఘం ప్రతినిధులు తెలిపారు.