హైదరాబాద్: 28°C
వార్తలు

గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తాం: సీఎం

AP: వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రాబోతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. 'గత రెండు పుష్కరాల సమయంలోనూ నేనే సీఎం. పుష్కరాలకు ముందే పోలవరం జాతికి అంకితం చేస్తాం. రూ.153 కోట్లతో కాటన్ బ్యారేజీ గేట్ల మరమ్మతులు చేస్తున్నాం. కాటన్ బ్యారేజీ నిర్మించి 175 ఏళ్లయింది' అని వెల్లడించారు.