హైదరాబాద్: 28°C
వార్తలు

యువకుడు గల్లంతు ఘటనపై ఎమ్మెల్యే చొరవ

TPT: వరదయ్యపాలెం మండలం మర్దవాడ సమీపంలోని క్వారీలో ఈతకు వెళ్లి సుకుమార్ అనే యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ సమాచారం అందుకున్న MLA కోనేటి ఆదిమూలం వెంటనే స్పందించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన జిల్లా పాలనాధికారికి సమాచారం అందించి, బీఎన్ కండ్రిగ, సత్యవేడు సీఐలు, ఎస్సైలకు తక్షణమే గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.