హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డు పనుల కోసం నిరాహార దీక్ష

CTR: పుంగనూరులోని పుంగమ్మ చెరువు కట్ట రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు డాక్టర్ అయూబ్ ఖాన్ సోమవారం శాంతియుత నిరాహార దీక్ష చేపట్టారు. రోడ్డు పనులు మధ్యలోనే నిలిపివేయటం బాధాకరమన్నారు. అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేసేంతవరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని చెప్పారు.