AP: కోనసీమలో వర్షాలు లేక నారుమడులు ఎండిపోతున్నాయి. వార్షాలు లేక.. కాలువల్లో నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పి.గన్నవరం, అమలాపురం ప్రాంతాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. దీంతో బకెట్లతో నీళ్లు పోసి నారుమడులను రైతులు కాపాడుకుంటున్నారు. జూలై సగం గడుస్తున్నా.. వాన చినుకు లేక ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు పంట బోదుల్లో కూర్చుని నీరు ఇవ్వాలంటూ నిరసనలు చేస్తున్నారు.
వార్తలు
కోనసీమలో కనిపించని వరుణుడు


