హైదరాబాద్: 28°C
వార్తలు

బెల్టు షాపులకు కళ్లెం వేయాలని ప్రజావాణిలో వినతి

NLG: చిట్యాల మండలం ఏపూర్ గ్రామంలో అనధికార బెల్ట్ షాపులను రద్దు చేయాలని కోరుతూ గ్రామ సంరక్షణా సమితి ప్రతినిధులు, ప్రజలు నల్గొండ కలెక్టర్‌కు సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతినిధి మందుల శ్రీకాంత్ మాట్లాడుతూ.. విచ్చలవిడి మద్యం వల్ల కూలీలు ఆర్థికంగా చితికిపోతున్నారని, ప్రమాదాల్లో యువకులు చనిపోయారని ఆవేదన చెందారు.