హైదరాబాద్: 28°C
వార్తలు

కారుతో ఢీ.. ఇంటర్ విద్యార్థిని మృతి

ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా కారు నడుపుతూ వచ్చిన ఒక మైనర్ బాలుడు, యాక్టివాపై వెళ్తున్న ఇంటర్ విద్యార్థినిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ప్రమాదానికి సంబంధించిన CCTV దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.