వరంగల్ జిల్లాలోని పలు రేషన్ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం వినియోగం లేక పాడవుతోందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైనప్పటికీ పాత నిల్వలను ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోవడంతో పురుగులు, ఎలుకల వల్ల నష్టం పెరుగుతోందని తెలిపారు. నిల్వలను వెంటనే తరలించి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వార్తలు
రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం నిల్వలపై ఆందోళన


