హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులకు వరి విత్తనాలు పంపిణీ

AKP: ఎస్. రాయవరం మండలం ఉప్పరాపల్లి రైతు సేవా కేంద్రంలో సోమవారం రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేసారు. పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పీఏసీఎస్ చైర్మన్ టి. నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందుగానే ప్రభుత్వం విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచిందన్నారు. అలాగే ఎరువులు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.