హైదరాబాద్: 28°C
వార్తలు

నదిలో కొట్టుకుపోయిన నలుగురు మైనర్లు

ఢిల్లీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఔటర్ నార్త్ జిల్లాలోని  హీరాంకి గ్రామం వద్ద యమునా నదిలో స్నానానికి దిగి నలుగురు మైనర్లు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో 2 మృతదేహాలను గుర్తించారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. నలుగురి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.