హైదరాబాద్: 28°C
వార్తలు

రేప్‌ నిందితుడికి జరిమానా.. ఆ డబ్బుతో పార్టీ

జార్ఖండ్‌లో పంచాయతీ పెద్దల నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల మూడేళ్ల చిన్నారిపై ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను పోలీసుల దృష్టికి వెళ్లకుండా సమస్య పరిష్కరిస్తామని పెద్దలు బాధిత కుటుంబాన్ని ఒప్పించారు. అనంతరం నిందితుడికి రూ.లక్ష జరిమానా విధించారు. దీనిలో భాంగా ముందుగా చెల్లించిన రూ.20 వేలతో ఆ పెద్దలు పార్టీ చేసుకున్నారు.