హైదరాబాద్: 28°C
వార్తలు

ఫాప్టో ఆధ్వర్యంలో రేపు ర్యాలీ

PPM: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (FAPTO) పార్వతీపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జూలై 14న (మంగళవారం) జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ర్యాలీ, పికెటింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటలకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు సమావేశమై, 10 నుంచి 11 గంటల వరకు పికెటింగ్ నిర్వహించనున్నారు.