SRCL: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సోమవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఏఈఓ శ్రవణ్ కుమార్ శాలువాతో సత్కరించి లడ్డు ప్రసాదం అందించారు.
వార్తలు
భీమేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్


