BDK: పినపాక మండలం తొగూడెం గ్రామంలో సోమవారం శీతల పానీయం తాగిన అనంతరం ఓ చిరు వ్యాపారి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అస్వస్థతకు గలకారణాలపై విచారణ కొనసాగుతుండగా, వైద్యుల నివేదిక అనంతరం పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
వార్తలు
శీతల పానీయం తాగిన అనంతరం వ్యాపారి అస్వస్థత


