SKLM: వర్షాకాలం ఆరంభమైన నేపథ్యంలో కోదూరు పంచాయతీ పరిధిలో కాలువల పూడిక తీత పనులను అధికారులు వేగవంతం చేశారు. ప్రధాన కాలువలు, ఉప కాలువల్లో పేరుకుపోయిన మట్టి, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్నారు. నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా, గ్రామంలో వరద నీరు నిలవకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పంచాయతీ కార్యదర్శి పేర్కొన్నారు.
వార్తలు
పంచాయతీలో కాలువల పూడిక తీత పనులు


