హైదరాబాద్: 28°C
వార్తలు

BREAKING: ఐదుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదురైలోని కొట్టాంపట్టి వద్ద రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.