హైదరాబాద్: 28°C
వార్తలు

శంకరస్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలు

PLD: రొంపిచర్లలో కొలువైన శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శంకర స్వామి దేవాలయంలో సోమవారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో మహాభిషేకం చేసి విశేష అలంకరణ చేశారు. అనంతరం హారతులు, నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.