తమిళనాడు ఎన్నికలపై వుయ్ ది లీడర్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అన్నామలై స్పందించారు. 39 ఏళ్లలోపు ఉన్న వారే అధికార మార్పునకు కారణమయ్యారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 2031లో మరోసారి కచ్చితంగా అధికార మార్పిడి జరుగుతుందని జోస్యం చెప్పారు. 2031 నాటికి తమ ఉద్యమం పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారి ప్రజల ముందుకు వస్తుందని స్పష్టం చేశారు. తాము ఆరోగ్యకమైన రాజకీయాల కోసమే కృషి చేస్తామన్నారు.
వార్తలు
2031లో కచ్చితంగా అధికార మార్పిడి: అన్నామలై


