హైదరాబాద్: 28°C
వార్తలు

BSNL సిగ్నల్ లేక వినియోగదారుల ఇబ్బందులు

ASR: రాజవొమ్మంగి మండల కేంద్రంలో బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ సిగ్నల్ తరచూ నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలకు రూ.350కు పైగా రీచార్జీలు చేస్తున్నా కాల్స్, ఇంటర్నెట్ సేవలు సరిగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బ్యాంకింగ్, ఓటీపీలు, ఆన్‌లైన్ సేవలకు అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.