అనంతపురం: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వరుడు సోమవారం ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చాడు. వేకువజామునే పురోహితులు రామకృష్ణ స్వామి మూల విరాట్‌కు పంచామృత, వివిధ అభిషేకాలు నిర్వహించి పుష్పాలతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
వార్తలు
ప్రత్యేక అలంకరణలో స్వయంభు జంబుకేశ్వరుడు


