హైదరాబాద్: 28°C
వార్తలు

HYDలో వాటర్ బంద్ ఇంకెన్ని రోజులు?

HYD: ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట, బంజారాహిల్స్ సహా పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగడంతో, HMWSSB ఎండీ అశోక్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. సరఫరాను త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.