నిర్మల్ జిల్లా కేంద్రంలోని వివిధ మీసేవ కేంద్రాలలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ రెండు రోజులుగా నిలిచిపోయింది. సీడీఎంఏ లాగిన్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాలే దీనికి కారణమని నిర్వాహకులు తెలిపారు. ఈ సమస్యను సాంకేతిక నిపుణుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. తరచుగా ఇవే పరిస్థితులు ఎదురవుతుండటంతో తాము, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు
సాంకేతిక లోపంతో నిలిచిన ధ్రువీకరణ పత్రాలు


