ATP: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. 1,451 మంది టీచర్ల కొరత ఉండగా, ఇప్పటివరకు 414 మందిని సర్దుబాటు చేశారు. డీఈవో కార్యాలయంలో నిర్వహించిన జిల్లాస్థాయి కౌన్సెలింగ్‌లో 23 మంది మిగలగా, 12 మంది సర్దుబాటుకు నిరాకరించారు. నగరపాలక పాఠశాలల్లో మిగిలిన వారిని జడ్పీ బడులకు పంపారు.
వార్తలు
జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తి


