NDL: నంద్యాల జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్(ఏఎస్పీ)గా నియమితులైన ఆర్.సుస్మిత సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం జిల్లా పోలీసు అధికారులతో సమావేశమై.. శాంతిభద్రతలు, ప్రజలకు సమర్థవంతమైన పోలీసు సేవలపై ఈమేరకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.
వార్తలు
నేడు జిల్లాలో ASP బాధ్యతల స్వీకరణ


