SRCL: గంభీరావుపేట లింగన్నపేట గ్రామ శివారులోని పోచమ్మ ఆలయం సమీపంలో జూదం నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.21,100 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
వార్తలు
జూద స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్


