హైదరాబాద్: 28°C
వార్తలు

డెడ్ స్టోరేజీలోకి పోచారం ప్రాజెక్ట్

KMR: నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలాలకు జీవనాడిగా ఉన్న పోచారం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీలోకి చేరింది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి చుక్క నీరు రాలేదు. దీంతో వేసవి ముగియక ముందే నీటిమట్టం తీవ్రంగా పడిపోయి ఖరీఫ్ సాగుపై అనిశ్చితి నెలకొంది. కేవలం 0.103 టీఎంసీ నీరు మాత్రమే నిల్వ ఉందని ఇరిగేషన్ ఏఈ అక్షయ్ తెలిపారు.