టీవీకేను ఇండియా కూటమిలోకి తీసుకురావాలన్న వీసీకే పిలుపును డీఎంకే వ్యతిరేకించింది. కేరళ, బెంగాల్ మోడల్ తమిళనాడులో నడవదని పేర్కొంది. రాష్ట్రంలో మారిన పరిస్థితుల్లో టీవీకేతో చేతులు కలిపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. కేవలం పదవుల కోసం డీఎంకేకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని మండిపడింది. ఇండియా కూటమిలో తమను కొనసాగించడానికి వీసీకేతో హస్తం పార్టీ పావులు కదుపుతుందని ధ్వజమెత్తింది.
వార్తలు
విజయ్‌తో చేతులు కలిపేది లేదు: డీఎంకే


