హైదరాబాద్: 28°C
వార్తలు

సర్పంచ్ కుమారుని వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే

SRCL: వేములవాడలోని ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బోయినిపల్లి మండలం అనంతపల్లి గ్రామ మాజీ సర్పంచ్ వంగపెల్లి సత్యనారాయణ రెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. వంగపెల్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు.