హైదరాబాద్: 28°C
వార్తలు

జమ్మూకశ్మీర్‌లో స్వల్ప భూకంపం

జమ్మూకశ్మీర్ బారాముల్లా జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.6గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని 10 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అర్థరాత్రి సమయంలో భూమి కంపించడంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు.