హైదరాబాద్: 28°C
వార్తలు

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

MHBD: ఇనుగుర్తి మండలం కోమటిపల్లి శివారు బావోజీ తండాలో ఆదివారం పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో 35 లీటర్ల గుడుంబా, 400 లీటర్ల బెల్లం పానకం, 50 కిలోల నల్ల బెల్లం, 8 కిలోల పటికను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై కరుణాకర్ తెలిపారు.