హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: యువ నాయకుడు నవీన్ రాజ్‌కు మంత్రి ప్రశంసలు

వరంగల్ తూర్పులో పార్టీ బలోపేతానికి యువ నాయకుడు నవీన్ రాజ్ చేస్తున్న కృషిని మంత్రి కొండా సురేఖ కొనియాడారు. కొండా మురళి పెద్దపులి అయితే నవీన్ రాజ్ చిన్నపులి అని వ్యాఖ్యానించారు. ఓసిటీలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆదివారం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలో నవీన్ రాజ్‌కు రాష్ట్ర పార్టీ పదవి కల్పిస్తామని తెలిపారు.