MNCL: తాండూర్ మండలం బోయపల్లి శివారులో ఆదివారం రాత్రి జరిగిన భూ వివాదంలో కాసిపేట గ్రామానికి చెందిన ప్రశాంత్ పై కేసు నమోదు చేసినట్లు SI ప్రసాద్ రావు తెలిపారు.మాసాడి చంద్రయ్య కుటుంబీకులు వ్యవసాయ భూమిని చదును చేస్తుండగా, ప్రశాంత్ వర్గం ఘర్షణకు దిగింది. పరస్పర దాడుల్లో మాసాడి భాస్కర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెల్లడించారు.
వార్తలు
భూ వివాదంలో ఒకరిపై దాడి.. కేసు నమోదు


