హైదరాబాద్: 28°C
వార్తలు

గుంటూరులో లాడ్జీలపై పోలీసుల తనిఖీలు

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలీసులు లాడ్జీలు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం 181 లాడ్జీలను తనిఖీ చేసి, 1,212 మంది బసదారుల గుర్తింపు పత్రాలను పరిశీలించారు. గుర్తింపు పత్రాలు లేకుండా గదులు కేటాయించొద్దని, సీసీటీవీలు నిరంతరం పనిచేసేలా చూడాలని లాడ్జీల నిర్వాహకులకు సూచించారు.