TG: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్‌లో జరిగే భేటీకి హాజరు కావాలని ప్రభుత్వం నుంచి అన్ని పార్టీల లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు ఆహ్వానం అందింది. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలు, పలు ప్రాజెక్టులకు రావాల్సిన నిధుల గురించి ఈ సమావేశంలో ఎంపీలకు సీఎం రేవంత్‌రెడ్డి వివరించనున్నారు.
వార్తలు
నేడు ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ


