హైదరాబాద్: 28°C
వార్తలు

'మాచారెడ్డిలో 65 శాతం SIR ప్రక్రియ పూర్తి'

KMR: మాచారెడ్డి మండలంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం 65 శాతం పూర్తైనట్లు తహసీల్దార్ సరళ భాయ్ నిన్న తెలిపారు. మిగిలిన అర్హులైన ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి నిర్ణీత గడువులోగా సమర్పించాలని ఆమె కోరారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.