హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ కొత్త గేట్ల పనులను ఇవాళ CM చంద్రబాబు ప్రారంభించనున్నారు. 117 పాత వరద గేట్ల స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.152.95 కోట్లు మంజూరు చేసింది. అలాగే, పిచ్చుకలంకలో రైతులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. ప్రధాన డ్యామ్, విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు పరిశీలించనున్నారు.