హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ

TG: పిల్లల్లో నులి పురుగుల నివారణకు ఇవాళ ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేయనున్నట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 1 నుంచి 19 ఏళ్ల వయసున్న 96,81,855 మంది పిల్లలు, విద్యార్థులకు ఈ మాత్రలు వేయనున్నారు. రాజ్‌భవన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంత్రి దామోదర రాజనర్సింహ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.