AP: అమరావతి ప్రాంతంలో ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు ఇచ్చే జీవనభృతి పెరిగింది. నెలకు రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ ప్రభుత్వం GO.NO 149 రిలీజ్ చేసింది. పెరిగిన భృతి 12 నెలలు అమల్లో ఉండనుంది. ఇందులోనే ఇంటి అద్దె సాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. జూలై 7న జరిగిన CRDA సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
వార్తలు
అమరావతి నిర్వాసితులకు జీవన భృతి పెంపు


