హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్ఐఆర్ ప్రత్యేక డ్రైవ్ విజయవంతం: కలెక్టర్

ATP: జిల్లాలో ఓటర్ల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రత్యేక డ్రైవ్ ఆదివారం విజయవంతంగా ముగిసింది. జిల్లాలో వంద శాతం ఓటర్లకు 20,38,523 ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయగా, ఇప్పటివరకు 17,35,243 ఫారాలను సేకరించి 85.12 శాతం అప్లోడ్ చేసినట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. 2,226 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఈ ఇంటింటి డ్రైవ్ సాగిందని వివరించారు.