హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు గిద్దలూరులో ప్రజా దర్బార్

ప్రకాశం: గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సోమవారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సమస్యలను తెలుసుకోనున్నారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు శ్రీనివాస నగర్‌లో రూ.66 లక్షల వ్యయంతో నిర్మించనున్న నాలుగు సిమెంట్ రోడ్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు.