హైదరాబాద్: 28°C
వార్తలు

రామగిరి ఆలయంలో అభివృద్ధి పనులు

TPT: పిచ్చాటూరు మండలం రామగిరి శ్రీ వాలీశ్వర స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం రూ.3 లక్షలతో కాంక్రీట్ ఫ్లోరింగ్ పనులు చేపట్టారు. దాత కేబీఎం ఎయిలరసన్ సహకారంతో పనులు పూర్తి చేస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ కేఎల్ వెంకటేశ్వర్లు తెలిపారు. టాయిలెట్ల నిర్మాణానికి రూ.13 లక్షలు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.