హైదరాబాద్: 28°C
వార్తలు

రామాపురం బీచ్‌లో అవేర్‌నెస్ ప్రోగ్రాం!

బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు, డీఎస్పీ మోయిన్ ఆధ్వర్యంలో చీరాల శక్తి టీం సభ్యులు సుబ్బారావు, సునీతలు, రామాపురం బీచ్ వద్ద ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు కృష్ణ హాస్పిటల్ డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లకు శక్తి యాప్ వినియోగం, ఎమర్జెన్సీ నంబర్లు 112,181,1930,1098ల గురించి వివరించారు. అలాగే సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలనపై అవగాహన కల్పించారు.