KMR: మద్నూర్ మండలం శేఖాపూర్ గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు. రూ. 10 లక్షలతో భవన నిర్మాణం చేపడుతున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు తెలిపారు. మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తుకారం, మహిళా సంఘం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
మహిళా సంఘం భవనానికి భూమిపూజ


