హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై కొరడా

SRPT: సూర్యాపేటలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈరోజు ఎస్సై రత్నం ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్ల వద్ద విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ, సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్, వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఎస్సై వాహనదారులను హెచ్చరించారు.