హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షాలు కురవాలని పాదయాత్ర

KRNL: గోనెగండ్ల కిందిగేరి యువకులు వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థిస్తూ ఆదివారం పాదయాత్ర చేపట్టారు. తుంగభద్ర నది జలాలను తీసుకుని గురజాల రామలింగేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని వరాల శివుడికి జలాభిషేకం నిర్వహించేందుకు బయలుదేరారు. వరుణదేవుడు కరుణించి రైతులకు అనుకూలంగా వర్షాలు కురవాలని, ప్రాంతం సస్యశ్యామలంగా మారాలని భక్తులు ఆకాంక్షించారు.