హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

W.G: భీమవరం కొవ్వాడ సబ్ స్టేషన్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. నూతన లైన్ నిర్మాణ పనుల కారణంగా ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కరెంట్ ఉండదని ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఉండి రోడ్, అరేటి నగర్, రాజీవ్ నగర్ కాలనీ, హాస్పిటల్ పరిసరాలు, నరసింహపురం ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.