హైదరాబాద్: 28°C
వార్తలు

'అవినీతి అక్రమాలపై విచారణ జరపాలి'

NLG: మునుగోడు మండలం కోతులారం ఎంపీపీఎస్ హెచ్‌ఎం అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని కార్పొరేట్ విద్య నియంత్రణ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బోల్గురి ముకేష్ ఆరోపించారు. ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం, బోగస్ బిల్లులు, పాఠశాల ఆస్తుల అపహరణ, బయోమెట్రిక్ హాజరు మోసాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఆయన వైఖరి వల్లే విద్యార్థుల సంఖ్య 8కి పడిపోయిందని, దీనిపై విచారణ జరపాలని కోరారు.