NZB: ఇందల్వాయి మండలం గన్నారం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.12,760 నగదు, పేకాట సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సుమలత తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
వార్తలు
పేకాట స్థావరంపై పోలీసుల దాడి


